నిద్రలేని రాత్రులే డ్రైవరన్నలకు జీవనాధారం..!
Local18 Andhra Pradesh Local18 Andhra Pradesh
4.28K subscribers
875 views
5

 Published On Aug 30, 2023

రవాణా వ్యవస్థలో కీలకపాత్ర పోషించే వారు ఎవరైనా ఉన్నారు అంటే మొదటగా తలుచుకునే పేరే డ్రైవరన్నలు. ఇలా డ్రైవరన్నలు రవాణా రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తూ సరుకుల రవాణాలో, తమదైన శైలిలో విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి డ్రైవరన్నలు రాత్రివేళ నిద్రను త్యాగం చేస్తూ వాహనాలను నడుపుతూ, కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ల నిద్ర కష్టాలు తెలుసుకుందాం..! ప్రకాశం జిల్లా (Prakasham District) లోని ఒంగోలులో గల జాతీయ రహదారి గుండా నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ వాహనాల రాకపోకలకు ప్రధాన సూత్రధారులే డ్రైవర్లు. ఇలా డ్రైవర్లు రాత్రివేళ నిద్రాహారాలు మాని వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితులు సైతం మనం చూస్తూ ఉంటాం.

అంతేకాదు నిద్రావస్థలోకి వెళ్తున్న డ్రైవర్లు ఎందరో ప్రమాదాల బారిన పడిన ఘటనలు సైతం ఉన్నాయి. మరికొందరు త్వరగా గమ్యం చేరుకోవాలని ఆకాంక్షతో వాహనాలను రాత్రివేళ మితిమీరిన వేగంతో నడుపుతూ అంగవైకల్యం పొందిన డ్రైవర్లు సైతం ఉన్నారు. మరి కొంతమంది డ్రైవర్లు ముందస్తు జాగ్రత్తగా నిద్రావస్థ దగ్గరికి చేరే సమయంలో వాహనాలను రహదారి ప్రక్కన నిలిపి చాలీచాలని లారీ క్యాబిన్ లోనే నిద్రావస్థలోకి జారుకుంటారు.
ఇది చదవండి: దేశంలో ఎక్కడ ఎన్నికలైనా జెండాలు తయారయ్యేది మాత్రం ఇక్కడే..!

ఆ ఇరుకు క్యాబిన్ లో లారీ డ్రైవర్లు నిద్రిస్తున్న దృశ్యాలు మనల్ని కలచి వేయడం పరిపాటి.ఇలా లారీ డ్రైవర్లు రాత్రివేళ ఎదురుకుంటున్న సమస్యలపై న్యూస్ 18 వారిని పలకరించగా పలు ఆవేదనకరమైన మాటలతో పలువురు డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ డ్రైవర్ మాట్లాడుతూ తాను రాత్రివేళ వాహనం నడిపే సమయంలో ప్రమాదాల బారిన పడిన ఘటనలు జరిగాయని, కానీ కుటుంబ పోషణ కోసం తప్పడం లేదంటూ తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశాడు.



అంతేకాదు ప్రత్యామ్నాయమైన ఉపాధి లేక ఇదే వృత్తిలో కొనసాగుతూ ప్రాణాలకు తెగించి డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నామంటూ మరికొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవరన్నలు రవాణా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తన్నా, ఆర్థికంగా వారి కుటుంబాలు పురోగతి సాగించలేదని వారి మాటల తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు నెలల తరబడి నిద్రాహారాలు మాని విధి నిర్వహణలో ఉత్తమ డ్రైవర్లుగా గుర్తింపు పొందిన ప్రతి వాహన డ్రైవర్ ను మనం అభినందించాల్సిందే.

News18 Local హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ అన్ని జిల్లాల నుంచి తాజా వార్తా కథనాలు, వీడియోలను తెలుగులో అందిస్తుంది. స్థానిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సమాచారం, పండుగలు, వినియోగదారులకు సంబంధించిన అంశాలు, మీకు సమీపంలో ఉన్న విద్య, ఉద్యోగావకాశాలు, ప్రకటనలు, విజయ గాథలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వివరాలను న్యూస్18 లోకల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.

Follow us @

  / news18telugu  
  / news18telugu  
  / news18telugu  

show more

Share/Embed