చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ గజ విజయవంతం
Local18 Andhra Pradesh Local18 Andhra Pradesh
4.28K subscribers
2,796 views
16

 Published On Sep 1, 2023

చిత్తూరు జిల్లా (Chittoor District) గుడిపాల మండలంలో విధ్వంసం సృష్టించిన ఒంటరి ఏనుగును గురువారం ఉదయం తమిళనాడు సరిహద్దు బోడినత్తం వద్ద ఓ మహిళను తొక్కి చంపేసింది. సరిహద్దు గ్రామాల ప్రజలును భయం కలిగిస్తున్న, ఏనుగును ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించారు. దీంతో ఆపరేషన్ గజ విజయవంతమైంది. గుడిపాలెం వద్ద ఏనుగు బుధవారం ఇద్దరిని తొక్కి చంపేసిన విషయం విధితమే . అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి కుంకి ఏనుగులను (శిక్షణ పొందిన ఏనుగుల) ను రప్పించి మండల పరిధిలో 197 రామాపురం పరిసరాల్లో తిష్ట వేసిన ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, అది అక్కడి నుండి తప్పించుకొని చీలాపల్లి మీదగా తాళంభేడుక చేరుకుంది.

అనంతరం అక్కడి నుండి తమిళనాడు సరిహద్దులో బోడినత్తo వద్దకు చేరుకుని ,అక్కడ వృద్ధ మహిళపై దాడి చేసి తిరిగి సరిహద్దు ప్రాంతమైన మండల పరిధిలోని 197 రామాపురానికి చేరుకుంది. గత రెండు రోజులుగా గుడిపాల మండలాన్ని గజగజలాడించిన ఒంటరి ఏనుగును రెవిన్యూ పోలీసులు అటవీ శాఖ సమన్వయంతో ఆపరేషన్ గజను సమర్థవంతంగా నిర్వహించింది.
ఇది చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న కడలూరు బోట్లు.. కొత్తపట్నం మత్స్యకారుల కష్టాలెన్నో!

197 రామాపురం వద్ద పొలాల్లోని చేరుకు తోటలో ఉన్న ఏనుగుపై తుపాకితో మత్తు మందు ప్రయోగించారు. ఇంజక్షన్ ప్రభావంతో ఏనుగు, మెల్లమెల్లగా మత్తులోకి జారుకుంది. అనంతరం కుంకీల సహాయంతో ఏనుగును తిరుపతి జూ పార్కు తరలిస్తున్నట్లు తెలిపారు.

News18 Local హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ అన్ని జిల్లాల నుంచి తాజా వార్తా కథనాలు, వీడియోలను తెలుగులో అందిస్తుంది. స్థానిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సమాచారం, పండుగలు, వినియోగదారులకు సంబంధించిన అంశాలు, మీకు సమీపంలో ఉన్న విద్య, ఉద్యోగావకాశాలు, ప్రకటనలు, విజయ గాథలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వివరాలను న్యూస్18 లోకల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.

Follow us @

  / news18telugu  
  / news18telugu  
  / news18telugu  

show more

Share/Embed