సహియించినవారిని HD video Song | ఫిమేల్ సింగర్ వర్షన్ | సింగర్ చంద్రకళ |
SALMAN SONGS & MESSAGES (SSM) SALMAN SONGS & MESSAGES (SSM)
16.3K subscribers
82,322 views
1.4K

 Published On Premiered Sep 12, 2022

క్రీస్తు సంఘం - చోడవరం
School Of Biblical Science Presents

Album name: HRUDAYADHINETHA (హృదయాధినేత)
Song name: Sahiyinchinavaarini (సహియించినవారిని)

Lyrics & Tune: Bro.Salman (Bible Teacher)
Music:- Prasanth Penumaka
Singer: Sis. Chandrakala
Producer: Bro.Raju
Keyboards & Synths Programmed by:- Prasanth Penumaka
Rhythm Programmed by:- Nishanth Penumaka
Flute by:- Ramesh K
Harmony by:- Priya, Fiji & Devu Matthews
Digitally recorded at:- Judson studios, Chennai
Grace Music Studio, Kavuluru
Sound engineers:- Judson Solomon, Chennai
Sampath penumaka, Kavuluru
Mix and Mastered by:- Sheik Arif Dany @ AD Music Studios
Video Editing & Poster : David raj (forever studio)
Title Art: -KING'S Arts


Lyrics



సహియించిన వారిని దన్యులనుచున్నాము
సహనాన్ని కలిగి ఉన్నామా?
ఓర్పు గల వారినీ వీరులంటుంటున్నాము
ఓర్చుకునే స్థితిలో ఉన్నామా?
ప్రియ నేస్తం... మన నాథుడు మన ప్రభు యేసు
మనకోసం... సహియించెను శ్రమలు అనేకం
చూపించే... మాదిరి మనకోసం
నేర్పించే... సహనమనే పాఠం.               | సహియించిన |


రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి
ప్రేమంతా తనకే పంచెను యాకోబు.
అందగత్తె కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి
కష్టపెట్టే లేయా మనసును ఆరోజు..
హృదయములో...  వేదన ఎంతో ఉన్నా..
సహనంతో... భరియించెను బాధలు ఎన్నో
తన సహనం.. దరిశించెను పరమున దైవం
ఫలములతో దీవించిన చరితను చదివాం
అది ఎరిగిన క్రైస్తవులం.. మనమే స్థితిలో ఉన్నాం..
సహియిస్తే పరమును చూస్తాం           | సహియించిన |


ఆనందం కోల్పోయి ఆస్తులన్ని పోగొట్టుకొని
వేదనతో పడిఉన్నాడు ఆ యోబు
ఆరోగ్యం చెడిపోయి కన్నబిడ్డలను కోల్పోయి
దిక్కు తోచక పడివున్నాడు ఆ రోజు
అనలేదే దేవునిని ఒక మాటైనా..
నిలబడెనే.. సహనముతో ఏదేమైనా
మన బ్రతుకే బాధల వలయంలా ఉన్నా
సహియిస్తే.. దన్యులుగా మిగిలెదమన్నా..
విశ్వాసం కలిగుంటే.. వాగ్దానం నిలుచుంది
శ్రమల మాటున సుఖముంది.            | సహియించిన |



మా పాటలు క్రైస్తవ సమాజానికి ఉపయోగకరంగా ఉంటున్నాయని మీకు అనిపిస్తే... ఒక పాటకు మీ స్పాన్సర్షిప్ అందించి భారభరితమైన ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరని కోరుచున్నాము.

School Of Biblical Science Team
Contact: 9676013996

Our Whatsapp Group link👇🏻
if ur wish.. join the SSM Group
https://chat.whatsapp.com/JU9CAIoUVuI...

show more

Share/Embed