ఈ యువకుడి కళకి హ్యాట్సాఫ్, కేవలం పెన్సిల్‌తోనే బొమ్మలు ఇతని ప్రత్యేకత
Local18 Andhra Pradesh Local18 Andhra Pradesh
4.28K subscribers
48 views
3

 Published On Aug 31, 2023

ఆ కళాకారుడు కుంచెపడితే తెల్లటి కాగితానికి ప్రాణం వస్తుంది. కేవలం పెన్సిల్ తో గిసిన చిత్రాలతో ఏకంగా ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ (Indian Book of Records) లో చోటుదక్కించుకున్నాడు. పెన్సిల్ తో అతను గీసిన చిత్రాలు ఎన్నో తెలిస్తే నోరెళ్ళబెట్టుకోవాల్సిందే. అతను గీసిన చిత్రాలకు వచ్చిన అవార్డులు రివార్డులకు వాళ్లు ఉంటున్న ఇల్లు కూడా సరిపోవడం లేదంటే ఏ రేంజ్ లో అతని చిత్రాలు ఉంటాయో ఊహకందని విషయంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరు ఆ ఆర్టిస్ట్..? ఎక్కడ ఉంటాడు..? ఏం చేస్తుంటాడు..? ఎప్పటినుంచి ఈ చిత్రాలు గీస్తున్నాడు అన్న పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని ప్రాంతం పట్టణంలోని నారాయణ గుంత ప్రాంతానికి చెందిన లక్ష్మి, పద్మనాభాచార్యుల దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో పెద్దకుమారుడైన శ్రీకాంత్ తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే చిత్రాలు గీయడంపై దృష్టి సారించారు. అలా మొదలై నేటికీ 3 వేలకు పైగా చిత్రాలు గీశారు. ఎలాంటి కలర్లు స్కెచ్ పెన్నులు వాడకుండా కేవలం ఒక పెన్సిల్ తోనే చిత్రాలు గీయడం ఇతని ప్రేత్యేకతగా చెప్పుకోవచ్చు. అతను పెన్సిల్ పట్టి తెల్ల కాగితంపై బొమ్మ గిశాడంటే ఆ బొమ్మకు ప్రాణం ఉట్టిపడేలా చేసే సత్తా అతనిది.దేవుళ్ల చిత్రాల నుంచి ప్రముఖులు, చారిత్రాత్మక, సినీ కథానాయకులు, రాజకీయ క్రీడాకారులు, సామాజిక వేత్తలు, అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండా కొనలు, వాగులు, వంకలు, సెలయేర్లు ఇలా చెప్పుకుంటే పోతే ఒక హిస్ట్రీనే అవుతుంది.
ఇది చదవండి: తమ్ముడిపై అక్కకు ఎనలేని ప్రేమ.. సొంతంగా రాఖీ తయారు చేసిన చిన్నారి

ఈ చిత్రాలన్నీ ఇతను కేవలం ఒక పెన్సిల్ పెన్ను ఒక తెల్లటి కాగితం ద్వారానే ఎన్నో కళాత్మక చిత్రాలు గీయడం ఈయనలో ఉన్న ప్రత్యేకత. ఇతను గిసిన చిత్రాలలో పేపర్ కాల్చిన తరువాత వచ్చిన బూడిదతో చేతితో గిసిన మహాత్మా గాంధీ చిత్రానికి ఏకంగా ఇండియన్ బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కిందంటే అతను గిసిన చిత్రాలు మన కళ్ళను అంతలా మైమరపిస్తాయి.



శ్రీకాంత్ తల్లితండ్రులు సైతం చిన్నపుడు అతను ఏదో బొమ్మలు గిసుకుంటున్నాడులే అనుకున్నారే కానీ ఇప్పుడు తమ కుమారుడు గిసిన చిత్రాలు చూసి వాళ్లకు కూడా నోట మాట రావటం లేదు. శ్రీకాంత ఒకవైపు చదువులో ఫస్ట్ క్లాస్ లో రాణిస్తూనే తన చదువు పూర్తయ్యాక కర్నూలులో ఒక బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడు ఇలా అద్భుతమైన చిత్రాలు గీయడం తమకు మాటల్లో చెప్పలేని సంతోషం ఉందని ఆ తల్లితండ్రిలు గర్వంగా ఫీల్అవ్వతున్నారు.

News18 Local హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ అన్ని జిల్లాల నుంచి తాజా వార్తా కథనాలు, వీడియోలను తెలుగులో అందిస్తుంది. స్థానిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సమాచారం, పండుగలు, వినియోగదారులకు సంబంధించిన అంశాలు, మీకు సమీపంలో ఉన్న విద్య, ఉద్యోగావకాశాలు, ప్రకటనలు, విజయ గాథలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వివరాలను న్యూస్18 లోకల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.

Follow us @

  / news18telugu  
  / news18telugu  
  / news18telugu  

show more

Share/Embed