challanainadamma maa badi - A Beautiful song by Lenin Babu, viluvala badi founder
venkipedia venkipedia
4.9K subscribers
91 views
5

 Published On Jun 3, 2024

Lyrics :- చల్లనైనదమ్మా మా బడి, ఇది విలువలు నేర్పే అమ్మ ఒడి
చదువు సంస్కారం పంచి, విజ్ఞానం అందించి
నైతిక విలువలు నేర్పించే ఆలయమే ఈ బడి
చల్లనైనదమ్మా ||

గోరుముద్దలవంటి కథలెన్నో మేము వింటాం
మెదడుకు మేతను పెట్టే, పాఠాలను నేర్చుకుంటాం
గురువులు తీర్చిదిద్దే, శిల్పాలమే మేము
విలువల వెలుగులు పంచే, దీపాలమౌతాము...!
చల్లనైనదమ్మా ||

ఆటలు పాటలు ఎన్నో, అలసటలేక నేర్చి
ఆనందంగా మేము, పుస్తకమే తీస్తాము
తల్లి తండ్రి గురువుల, ఆదర్శంగా భావించి
సమాజసేవను చేయ, ముందడుగే వేస్తాము
చల్లనైనదమ్మా ||

పచ్చని చెట్లను పెంచి, ప్రకృతిని కాపాడి
భావితరాల కోసం, బంగరు బాటలు వేసి
మానవ విలువలు పంచే, ముద్దు బిడ్డలమౌతాము
భారత ఖ్యాతిని పెంచే, భావి పౌరులమౌతాము
చల్లనైనదమ్మా ||

challanainadamma maa badi - A Beautiful song by Lenin Babu, viluvala badi founder

#song
#venkipedia
#challanainadammaMaaBadi
#LeninBabu

show more

Share/Embed