పవిత్రురాలైన కన్యకగా - Ps. Y. YESUDAS (బాబన్న) గారు రచించిన పాట|| Pavithruralaina Kanyakaga|Cover|
Ps.Yerravelly Yesudas బాబన్న గారు Ps.Yerravelly Yesudas బాబన్న గారు
6.24K subscribers
45,025 views
946

 Published On Jul 2, 2020

Pastor Yerravelly Yesudas (బాబన్న) 1977-2000.

"పవిత్రురాలైన కన్యకగా" పాటను 1999 సం. లో రచించి సంఘములో పాడారు. ఈ పాటను తన ఆత్మీయ సహోదరుడైన Pastor. Anand Joshua గారు, మరుగున పడిపోకుండా Hallelujah Ministries Songs Album లో పాడించారు.

బాబన్న గారి పాటలు ఏంతో మంది విశ్వాసులకు మరియు సేవకులకు నేటి వరకు వారి ఆద్యాత్మిక జీవితాలను బలపరచున్నవి.
అతి చిన్న వయసులో, మరి తక్కువ సమయంలోనే దేవుడు తన సేవలో ఆత్యదికముగ బాబన్న గారిని వాడుకున్నారు.

1991 లో తను 13 సం. ల వయస్సు లో దేవుని సేవ నిమిత్తమై పిలువబడీ, హోసన్న మీనిస్ట్రిస్, చిలకలగుడ, సికింద్రాబాద్ చర్చ లో 3 సం. లు పరిచర్య చేసారు.
ఆటు తరువాత తను 16 సం. ల అప్పుడు 8 INC Line, గోదావరిఖణి లో సురేష్ అన్న గారీ తో 2 సం. లు పరిచర్య చేసారు.
తను 18 సం. ల అప్పుడు సురారం, జీడిమేట్ల లో సంఘమును స్థాపించి 3 సం. లు ప్రభు పరిచర్య లో అనేక ప్రాంతములకు సేవ ను విస్తరంపజేసారు.

ఆరోగ్యం క్షిణించిన కూడ సంపూర్ణమైన దైవిక స్వస్థతలో ఉండి ఏ విదమైన మందులు గాని చెకప్ లు గాని చేయించుకోడానికీ అయన అంగికరించలేదు. చివరి క్షణం వరకు ప్రభువు నందు నీరిక్షణ కలిగి 29వ ఏప్రిల్ 2000 సం. లో అయన 23సం.ల వయస్సులో తను పరిచర్య చేసిన గోదావరిఖణి లో సురేష్ అన్న గారి చర్చ్ లో ప్రభువు నందు నిద్రించారు.

బాబన్న గారు పాడిన పాటలు హోసన్న మీనిస్ట్రిస్ లో

1) పోరాటం ఆత్మీయ పోరాటం (1994) Vol 5 (1995) cassette లో ఏసన్న గారు మరియు అనంద గారు పాడారు. బాబన్న 16 సం. వయస్సు లో SPG church 1994 Convention లో పాడిన మొదటి పాట ఇది.

2) యేసయ్య నా నిరీక్షణ అదారమా (1996) Vol 6 Cassette తన స్వంత స్వరంతో.

3) స్తుతి సింహాసనాసీనుడవు (1997) Vol 7 Cassette తన స్వంత స్వరంతో.

4) కృపా నా కోసం సిలువలో వెలిసింది (1998) బాబన్న ఈ పాట సంఘంలో పాడారు.

5) ఆదరణ కర్తవు (1998) Vol 9 Cassette (1999) లో అనంద గారు పాడారు.

6) నా విశ్వాస ఓడ యాత్ర (1999) హోసన్న మీనిస్ట్రిస్, చిలకలగుడ మందిర ప్రతిష్ఠత ముందు రోజున పాడారు.

7) సీయోను రాజా జయగీతం (1999) ఈ పాట సంఘంలో పాడారు. తన తోటి సేవకుడైన Bro. శ్యామ్ పాల్ గారు, మనుగురు తన చానెల్ లో పాడారు(2019).

8) యాజమానుడా (1998-1999) సంఘంలో పాడారు. ఈ పాటను తన ఆత్మీయ సహోదరుడైన Pastor. Anand Joshua గారు, మరుగున పడిపోకుండా Hallelujah Ministries Songs Album లో పాడించారు.

9) పవిత్రురాలైన కన్యగా (1998-1999) సంఘంలో పాడారు. ఈ పాటను తన ఆత్మీయ సహోదరుడైన Pastor. Anand Joshua గారు, మరుగున పడిపోకుండా Hallelujah Ministries Songs Album లో పాడించారు.

10) కనికరా స్వరూపుడా నాలో నిలచిన సజివుడా (2000) తన ఆరోగ్యం క్షీణించుచున్న సమయంలో చిలకలగుడ చర్చ లో పాడిన పాట ఇది.

11) నీ సిలువను మోసుకొని ఓంటరీగనే వేళ్ళిపోవుచున్నావా (2000) తను చివరిగా రాసుకున్న పాట ఇది.

Bro. సురేష అన్న, గోదావరిఖణి గారి చర్చి లో 29th April 2000 నాడు ప్రభువు నందు నిద్రించారు.
బాబన్న గారి అంతిమ యాత్రలో Bro. సురేష్ అన్న గారు ఈ పాటను పాడారు.

బాబన్న గారు 23 సం. వయస్సు లోనే ప్రభువు చేత కోనిపోబడినాడు.
అయన సాక్ష్యం నేటికి ఏంతో మందిని ఆత్మీయముగ బలపరుచున్నది.

ఇంకా చాల పాటలు రచించి సంఘములో పాడినారు, అవి ఇంకా లభించలేదు.

show more

Share/Embed