Precautions To Be Taken After Heart Surgery (Telugu Version) | Heart Surgery Care | Bypass Surgery
Medicover Hospitals Medicover Hospitals
68.1K subscribers
205,461 views
2.5K

 Published On Jan 23, 2021

డా. ఏ. ఆర్. కృష్ణ ప్రసాద్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో గుండె ఆపరేషన్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

0:00 - గుండె ఆపరేషన్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుండె ఆపరేషన్ తరువాత చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయని, డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటారని తెలిపారు.

గుండె సర్జరీ తరువాత నెల నుండి రెండు నెలలు వరకు మంచం పట్టునే ఉండాలి అనేది అపోహ అని అటువంటివి చేయవల్సిన అవసరం లేదు అన్నారు. రోజు చేసుకునే దిన చరియలు సాధారణంగానే చేసుకోవచ్చు అన్నారు.

2:55 - గుండె సర్జరీ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు:
- గాయాలకు దెబ్బ తగలకుండా చూసుకోవడం
-నొప్పి వచ్చే పనులు చేయకుండా ఉండడం
-డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించడం

3:08 - గాయాలకు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు:
-ఇంటికి చేరుకున్నప్పుడు డ్రెస్సింగ్ తీసివేసి, ఉదయం స్నానం చేసిన వెంటనే గాయాన్ని శుభ్రమైన పొడి వస్త్రంతో ఆరబెట్టడం , గాయం పై బీటాడిన్ ద్రావణం పొడి వేసి గాలి తగిలేలా వదిలేయడం వంటివి చేయాలి
-కనీసం ఒక నెల కాళ్ళకు కట్టు వాడాలి, తద్వారా కాళ్ళకు వాపు ఉండదు మరియు ఇతరు గాయాలు త్వరగా నయం అవుతాయి
-దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు ఛాతీ బైండర్లు వాడడం వల్ల చాతి పై ఒత్తిడి పడకుండా గాయం తొందరగా నయం అయే అవకాశాలు ఉంటాయి
-ఫ్లాట్ గా పడుకోవడం వంటివి చేయాలి

8:18 - ఆపరేషన్ తరువాత ఏది చేయాలీ, ఏది చేయకూడదు?
-రెండు నుండి మూడు నెలల వరకు బరువులు ఎత్తకూడదు.
-వంగడం వంటివి చేయకూడదు.
-డ్రైవింగ్ వంటివి రెండు నెలల తరువాతే చేయాలి
-విమాన ప్రయాణం వంటివి నెల తరువాతే చేయాలి
-కారులో లేదా బస్సులో దురా ప్రయాణాలు చేయకూడదు, అలా చేసినప్పుడు ఆగుతూ వెళ్లడం వంటివి చేయాలి
-అర కిలోమీటర్ లేదా కిలోమీటర్ వరకు నడవచు

13:05 - డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
-99°F కంటే ఎక్కువ జ్వరం ఉంటె డాక్టర్ ని సంప్రదించాలి
-చాతి గాయం లేదా కాలు గాయం నుండి రక్తం లేదా చీము వస్తే డాక్టర్ ని సంప్రదించాలి
-చాతి ఎముకల దెగ్గర ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు సంప్రదించాలి
-బీపీ లో అయినప్పుడు లేదా కళ్ళు తిరిగినప్పుడు.

21:28 - గుండె ఆపరేషన్ తరువాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
-పౌష్టిక ఆహారం తీసుకోవాలి
-పుల్లటి పండ్లు వంటివి తీసుకోవాలి
-ఆకు కూరలు తీసుకోవాలి

22:48 - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ?
- నిలువ పచ్చడ్లు తినవద్దు
-బాగా మాసాలాలు ఉన్న ఆహారం తీసుకోకూడదు
-ఎక్కువ కారం ఉన్న పదార్ధాలు తీసుకోకూడదు
-షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకూడదు

సర్జరీ తరువాత మొదటి కన్సల్టేషన్ ఒక వారం రోజులకి ఉంటుందని, తరువాత ఒక నెలకి, ఆ తరువాత ప్రతి మూడు నెలలకి ఒకసారి కన్సల్టేషన్ ఉంటుందని తెలిపారు.

జ్వరం వచినప్పుడు తగ్గడానికి, గాయాలు మానడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉండడానికి ఎటువంటి టాబ్లెట్స్ వాడాలి అనే మరిన్ని వివరాల కోసం వీడియోని పూర్తిగా వీక్షించండి.

#HeartSurgeryCare #BypassSurgery #HeartBypassSurgery

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook:   / medicoverhospitals  
Instagram:   / medicoverhospitals  
Twitter:   / medicoverin  
Linkedin:   / medicoverhospitals  

show more

Share/Embed