Brinajl Grafting, drip, Mulching by BCT-KVK farmer Mr. Karri Naveen, Ganaparthi of Anakapalli.
BCT - KVK BCT - KVK
363 subscribers
198 views
4

 Published On Jun 22, 2024

యువ రైతు కర్రి నవీన్ ఆధునిక పద్ధతిలో మల్చింగ్ మరియు బిందు సేద్యం తో పాటుగా అంటుకట్టిన వంగ మొక్కలను సాగు చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. 2023 ఆగస్టులో మొదటిసారిగా అంటు వంగ మొక్కలను నాటి ఐదు నెలల పాటు పంట తీసిన తర్వాత, జనవరి 2024లో ట్రిమ్మింగ్ చేయడం ద్వారా ప్రస్తుతం జూన్ 2024 నాటికి రెండవ పంట కూడా పూర్తి కానుంది. మళ్లీ ట్రిమ్మింగ్ చేయడం ద్వారా మూడవ పంటను కూడా తీసే ఆలోచనలో, ఒకే పొలంలో సాగు ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా నాణ్యమైన దిగబడులు, సుస్థిర ఆదాయం సాధించవచ్చని నిరూపించారు.
బిందు సేద్యం మరియు మల్చింగ్ వాడడం ద్వారా ప్రధానంగా కలుపు ఖర్చు లేదని, ఎరువులు వేసే విధానం కూడా డ్రిప్ ద్వారా పంపించడం వలన ఎక్కువ శాతం మొక్కలకు ఉపయోగపడుతుందని, నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరిగిందని అన్నారు.
చీడపీడలను తట్టుకునే సామర్థ్యం కూడా పెరిగినట్టు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానని అన్నారు.
క్రమం తప్పకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంచుకోవడం ద్వారా మార్కెట్లో ధరల వ్యత్యాసం ద్వారా వచ్చే నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగానని చెప్పారు.
-
బిసిటి - కృషి విజ్ఞాన కేంద్రం యువరైతు
కర్రి నవీన్
గణపర్తి గ్రామం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా.

show more

Share/Embed