కాకినాడ జిల్లా సబ్ జైల్లో ఖైదీల మధ్య రాఖీ పండుగ
Local18 Andhra Pradesh Local18 Andhra Pradesh
4.28K subscribers
114 views
0

 Published On Aug 30, 2023

వివిధ సమస్యలలో రీత్య సబ్ జైల్లో ఉంటున్న ఖైదీలకు నిజమైన జీవితం అంటే ఏంటి . జీవితంలో ఏం చేయాలి. ఏ విధంగా మనం బ్రతకాలి. ఇలా పలు విషయాలు వివరిస్తూ రాఖీ పండుగ సందర్భంగా రిమాండ్ల ఉన్న పలువురికి ప్రత్యేక రాఖీలు కడుతూ అన్నాచెల్లెళ్ల పండగ యొక్క విశిష్టతను వివరించారు కాకినాడ జిల్లా బ్రహ్మ కుమారీలు..! అన్నాచెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల బంధాన్ని చాటు చెబుతూ ఒకరికి ఒకరు రక్షగా ఉండే పవిత్ర పౌర్ణమి రోజు వచ్చే ఈ రాఖీ పండుగ రోజున కట్టే రాఖీ ఎంతో పవిత్రమైనదని కాకినాడ జిల్లా (Kakinada District) బ్రహ్మకుమారిలు తెలియజేశారు. మానవ జీవితంలో ప్రధానమైనది మనసుని ఆమనసు ఎప్పుడూ భగవంతుడు కు అర్పించాలని మనకి కళ్ళముందు కనిపించే ఇవన్నీ నిజమైనవి కాదని దైవసేవే మనకి నిజమైనదని ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు ప్రత్యేకంగా వివరించారు.

నిజానికి ఈదేహం ఈఅందం మనకి కనిపించే ప్రతి వస్తువు ఏది మనతో రాదని అయితే మనం చేసే మంచి మాత్రం మనతో వస్తుందని మనతో వచ్చే దానిపై మొక్కు చూపించి మంచిని పెంచుకుంటూ మానవ జీవితంలో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో తుని పలు ప్రాంతాల్లో గల సబ్ జైల్లో ఉన్న పలువురికి అదే విధంగా జైలు అధికారులకు సైతం ప్రత్యేక రాఖీలు కట్టి వారికి స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కాకినాడ జిల్లాలో గల బ్రహ్మకుమారీలు ప్రత్యేకంగా దీవెనలు అందజేశారు.
ఇది చదవండి: తమ్ముడిపై అక్కకు ఎనలేని ప్రేమ.. సొంతంగా రాఖీ తయారు చేసిన చిన్నారి

మరోపక్క జిల్లాలో ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు వివిధ సంఘాల నేతలకు వారు ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతానికి ఈ బ్రహ్మకుమారిళ్లంతా చేరుకుని వారికి ప్రత్యేకంగా జీవితం యొక్క సిద్ధాంతం వివరించి అనంతరం రాఖీ కట్టి ప్రత్యేక దీవెనలు అందజేస్తున్నారు ఇలా ఏడాదికి ఒకసారి కట్టే ఈ రాకి ఏడాది పొడుగునా వారందరికీ రక్షణగా నిలుస్తుందని బ్రహ్మకుమారి మాధవిలత కాకినాడ జిల్లాకు చెందిన మాధవిలత మీడియాకు తెలిపారు.



ఇదిలా ఉండగా బ్రహ్మకుమారిళ్ల చేత రాఖీ కట్టించుకోవడం కూడా ఎంతో అదృష్టం ఉండాలని భావిస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు నిజానికి ఎటువంటి స్వార్థం లేకుండా వారి జీవితాన్ని దేవుడికి అర్పించి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలని లోకం బాగుండాలని వారు అనేక కార్యాలు చేస్తుంటారు ఈ నేపథ్యంలో వారి చేత తొలి రాఖీ చేతికి కట్టించుకోవడం ఎంతో శుభ పరిణామం అంటూ వారంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

News18 Local హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ అన్ని జిల్లాల నుంచి తాజా వార్తా కథనాలు, వీడియోలను తెలుగులో అందిస్తుంది. స్థానిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సమాచారం, పండుగలు, వినియోగదారులకు సంబంధించిన అంశాలు, మీకు సమీపంలో ఉన్న విద్య, ఉద్యోగావకాశాలు, ప్రకటనలు, విజయ గాథలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వివరాలను న్యూస్18 లోకల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.

Follow us @

  / news18telugu  
  / news18telugu  
  / news18telugu  

show more

Share/Embed