Ramayapatnam Port | రామాయపట్నం పోర్టు | AP Infra Story
AP Infra Story AP Infra Story
19.8K subscribers
5,414 views
160

 Published On May 10, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారీ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ను నిర్మిస్తుంది

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన రామాయపట్నం పోర్ట్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రూ.10,640 కోట్లతో , 19 బెర్తులతో సొంతంగా నిర్మిస్తుంది

తొలి దశలో రూ.4902 కోట్లతో 34 Million Tons Annual Cargo Handling సామర్థ్యంతో నాలుగు బెర్తులు నిర్మిస్తున్నారు (ఇందులో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు )

రెండో దశలో 163.54 Million Tons Annual Cargo Handling సామర్థ్యంతో మొత్తం 19 బెర్తుల నిర్మిస్తారు

రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుంది...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి రామాయపట్నం పోర్ట్ అత్యంత కీలకం కానుంది ... రామాయపట్నం పోర్టు పక్కనే ఒక భారీ ఇండస్ట్రియల్ పార్కుని కూడా అభివృద్ధి చేస్తున్నారు... Indosol అనే సంస్థ రామయపట్నం పోర్టు వద్ద 25 వేల కోట్లు భారీ పెట్టుబడితో Solar PV modules మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది... ఈ ప్లాంట్ మొదటి దశ లో భాగంగా మార్చ్ 31, 2024 na ఇక్కడ Solar PV modules ఉత్పత్తిని కూడా ప్రారంభమైంది

రామాయపట్నం పోర్టు నిర్మాణంతో అతి త్వరలో నెల్లూరు & ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు భారీ పరిశ్రమలతో కళకళలాడునున్నాయి

రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులకు సీఎం వై.ఎస్ జగన్ 2022 జూన్ లో శంకుస్థాపన చేశారు.. Feb 2024 నాటికి రామాయపట్నం పోర్టు వాణిజ్య కార్యకలాపాలు సిద్ధమైంది

మొదలుపెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు సిద్ధమయ్యిందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు

రామాయపట్నం పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖకు ఫిబ్రవరి 2024 లో లేఖ రాసింది... ఈ అనుమతులు రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది... ఇంతలో ఎలక్షన్ కోడ్ రావడంతో రామాయపట్నం పోర్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది

ఆగస్టు 2024 లో సీఎం వై.ఎస్ జగన్ చేతుల మీదుగా రామయ్య పట్నం పోర్ట్ ప్రారంభోత్సవం జరగనుంది

రామాయపట్నం పోర్టు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కి కొత్త నాంది పలకనుంది

#AndhraPradesh #RamayapatnamPort #Development #Nellore #GreenfieldPort #APNewPorts #Ramayapatnam #APInfraStory

show more

Share/Embed