Psalms 6th chapter/కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం /Jesus christ songs in telugu and God promises
Jesus christ songs in telugu and god promises Jesus christ songs in telugu and god promises
3.18K subscribers
333 views
0

 Published On May 25, 2022

#bible #teluguaudiobible #trending #trendingvideo #jesus #audiobible #psalms #keerthanalu

Psalms 6th chapter/keerthanalu 6via adhyayam

1.యెహోవా , నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2. యెహోవా , నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా , నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
3. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా , నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4. యెహోవా , తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5. మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?
6. నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
7. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
8. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
9. యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
10. నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

show more

Share/Embed