ఆనందోత్సాహాలతో అలరించే అవధానం!!
Umamaheswararao Yarramsetti Umamaheswararao Yarramsetti
2.03K subscribers
44,323 views
626

 Published On Aug 30, 2024

#umamaheswararaoyarramsetti #umamaheswararao #yarramsetti #avadhani

‪@SathguruTatvam‬ ‪@UmamaheswararaoYarramsetti‬
Video Credits - Sathguru Tatvam - Sri Viswa Vijnana Vidya Adhyatmika Peetham, Pithapuram.

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో అలరించిన భగవద్గీత అష్టావధానం - శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యవంలో స్థానిక గౌతమ ఘాట్‌లోని ఆదివారం సాయంత్రం భగవద్గీత అష్టావధానం సాహితీ ప్రియులను అలరించింది. తిరుపతి రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు గీతపై 19అవధానాలు చేసి, 20వ అష్టావధానం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామివారి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి అవధాన ప్రాచార్య, పద్యకళాతపస్వి ధూళిపాళ మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరించారు. కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి శ్లోకదర్శనము, శతావధాన శరచ్చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మ సంఖ్యాదర్శనము, నర్తకఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ అంత్యాక్షరి, తెలుగు పండిట్ దువ్వూరి మల్లికార్జున రావు వ్యస్తాక్షరి, డాక్టర్ బీహెచ్ వి రమాదేవి అఖండపఠనం, దేవవరపు నీలకంఠ రావు విలోమపఠనం, విద్యా విశారద డాక్టర్ అద్దేపల్లి సుగుణ అక్షర దర్శనం, తెలుగు పండిట్ ఎం. వెంకటలక్ష్మి అప్రస్తుత ప్రసంగంతో పృచ్ఛకులుగా వ్యవహరించి ప్రశ్నలనే శర శస్త్రాలు సాధించగా, అవధాని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో ఎదుర్కొంటూ, ఆద్యంతం రక్తికట్టించారు.

భగవద్గీత 18 అధ్యయాలు మానవ నడవడిక ఎలా ఉండాలో వివరిస్తాయని అవధాని పేర్కొన్నారు. శారీరక, వాచిక, మానసిక తపస్సులు సక్రమంగా ఆచరిస్తే, అదే మనం భగవంతునికి ఇచ్చే కానుకగా పేర్కొన్నారు. అవధానం అనంతరం కవులకు, గౌతమఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు సత్కారం చేసారు. డా గోలి వెంకట రామారావు, డా. జి. నాగేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పీఠం శాఖ అధ్యక్షులు ఎం.ఆర్. కె రాజు, కార్యదర్శి డి. కృష్ణంరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వనపర్తి సత్యనారాయణ, మెంబర్స్ శేఖర్, కలికిమూర్తి, పివిఎస్ కృష్ణారావు, తోట సుబ్బారావు, సవితాల చక్రభాస్కరరావు, డా. పివిబి సంజీవరావు, తరపట్ల సత్యనారాయణ, పలువురు సాహితీ ప్రియులు, పీఠం భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

#svvvap1472 #svvvap #drumaralisha #Avadhanam #asthavadhanam #umaralisha #rajamahendravaram #rajamandry #UmamaheswararaoYarramsetti #Umamaheswararao #Yarramsetti #Umamahesh #Gitavadhani #Gitavadhanam #Ashtavadhanam #Ashtavadhana #Avadhana

show more

Share/Embed