mujjegammulaNelu MuggurammalaSakthi -G.Sowmya
Dittakavi Santha Srinivasa Rao Dittakavi Santha Srinivasa Rao
2.16K subscribers
258 views
7

 Published On Aug 2, 2020

ముజ్జగమ్ముల నేలు ముగ్గురమ్మల శక్తి రాసిపోసిన మహారాణివే నీవు
సర్వచైతన్య సాకారమూర్తి
శరణు శరణోయమ్మ కరుణాకటాక్షి

ఓంకారనాదమున సాకారమే నీవు
వేదాదివిద్యలకు ఆధారమై నావు.
శృతిలయల గతులలో శుద్ధసంగీతమై
వాగార్ధమున మూలమై వెలసినావు


జగములనుపోషించు సంపదలదేవతవు
అష్ఠసిద్ధులతోడ అందగించే కళవు
కడగంటి చూపులు కనకధారలు కురిసి
లేమి అనుమాట ని లేకుండ చేసెదవు.

లోకైకదీపాంకురానివే నీవు
దుర్గతుల దునుమాడు దుర్గవైనావు
చిన్మయానలమందు చిగురించు మూర్తివై
శివుని పట్టపురాణి గా వెలగినావు

రచన-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు🙏💐

show more

Share/Embed