సిరివెన్నెల - విరించినై విరచించితిని - విధాత తలపున - కవిత - - SiriVennela Vidhatha Thalapuna
Vijay Jeedigunta Vijay Jeedigunta
2.52K subscribers
2,505 views
83

 Published On Dec 6, 2021

సిరివెన్నెల చిత్రం లో విధాత తలపున పాటకి స్ఫూర్తి ఈ 'నాదోపాసన' అనే శీర్షిక తో రాయబడిన కవిత . సీతారామ శాస్త్రి గారు ఈ కవిత భరణి పేరు తో రాశారు. ఆయన చిత్రసీమకు రాక మునుపే ఆంధ్ర ప్రభ లో ప్రచురితమయింది. ఈ వీడియో లో గురువు గారు ఆ కవిత ని తనదైన బాణీలో ఆలపించగా కిరణ్ ప్రభ వారింట్లో గారు 2004 మార్చి నెలలో రికార్డు చేసిన వీడియో ఇది. ఎంత అద్భుతమైన భావ వ్యక్తీకరణ, అలాగే ఎంత హృద్యమైన గంభీర కవితాలాపన.

*************************
విరించినై నే విరచించితిని
విపంచినై నే వినిపించితిని
కుసుమ కోమలం నా ఈ గీతం
నీ ఆరాధనకై సమర్పితం

లలిత లయ జనిత
మృదుల పదగమిత
సరస స్వర సరిన్నటనమీ సరిగమ
ఇది సామ నిగమ
సుధా మధురిమ

ప్రభవించు ప్రతి శిశువు
తొలి రవము లోన
నినదించును కోటి రాగాల వీణ
నర్తించి నిదురించు ఏ చరణమైన
పల్లవించును నీ పాట లోన
అనాది రాగం ఆది తాళమున
నిత్య నూత్నమై రమ్య గీతమై
కమనీయ కావ్యమై
రవణించును నీ విలాసమున

విరిసిన ప్రతి పువ్వు కురిసిన చిరునవ్వు
ధీర సమీర సమాహార సుమధుర
మోహన రాగ రంజని
రేగిన సుడిగాలి రేపిన పెనుధూళి
కాలగళమ్మున నీవాలపించిన శివరంజని
ప్రణయమైన పెను విలయమైన
కళ్యాణమైన కల్లోలమైన
నీ తాండవమున లయగా
నీ నాద వినోద విహార విహాయస
వీటికి తారాహారమై
నువు కల్పించిన శ్రుతి గా
నిను తలపించిన స్మృతిగా

ప్రాగ్దిశ వీణియ పైన
దినకర మయూఖ తంత్రుల పైన
మేల్కాంచిన పులుగుల కీలకిలాంగుళుల
నువు పలికించిన రాగములోన
ప్రత్యూషాలాపనలోన
అంతరంగముప్పొంగగ
రాగ రంగేళి రజని శృంగార రమణి
ఆకాశ రంగ వేదికపై
రాకా శశి వినోదముకై
సాగర తరంగ మృదంగ నినాద నర్తిత
విలాస వర్తిత కళా కళాపములోన
ప్రదోష గీతములోన
గానమే చైతన్యమై
నాదమే జగన్నాథమై
సృష్టి తంత్రమై మహా మంత్రమై
నీదై నీకై నీవై నిండిన
విలాస విన్యాస సరళి గని
నా వినమిత గాత్ర నివాళియని
******************

show more

Share/Embed