బీపీ, డయాబెటిస్ కి‌‌.. ఈ ఆహార విధానాలతో చెక్ పెట్టండి.. Millets Magical Benefits | Dr. KhaderVali
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
92,800 views
1.5K

 Published On Feb 9, 2023

#raitunestham #millets

అద్భుతమైన ఔషధ గుణాలు... ఔరా అనిపించే రుచులు... అమితమైన ఆరోగ్య ప్రయోజనాలు... చిరుధాన్యాల సొంతం. ఆధునిక యుగంలో ముప్పేట దాడి చేస్తోన్న రోగాలను నియంత్రించేందుకు ఉత్తమ ఆహారం... సిరిధాన్యాలు. ఇన్నాళ్లు.. ఇతర ఆహారాలకు అలవాటు పడిన నేపథ్యంలో... చిరుధాన్యాల వైపు ఎలా మళ్లాలి ? ఏయే రకాల వంటలు చేసుకోవచ్చు ? వివిధ రకాల చిరుధాన్యాలతో కలిగే మేలేంటి ? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ వంటి జీవనశైలి అనారోగ్య సమస్యలను చిరుధాన్యాల ఆహారం ఎలా నియంత్రిస్తుంది ? శరీరానికి సంపూర్ణ పోషకాలు అందిస్తుంది ? ఇలా అందరిలో ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.... మిల్లెట్స్ నిపుణులు రాంబాబు... ఆహార ఆరోగ్య నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో, కర్షక సేవా కేంద్రం నిర్వహణలో... 2023, జనవరి 8న హైదరాబాద్ కూకట్ పల్లిలోని.. సమతానగర్.. అడ్డగుట్ట.. MNR కాలేజ్ ఎదురుగా ఉన్న స్థలంలో జరిగిన చిరుధాన్యాలపై అవగాహన మరియు చిరుధాన్యాలతో వంటకాలపై శిక్షణ కార్యక్రమం పాల్గొని... ఆహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.. హైదర్ గూడ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు.. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

-----------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • ప్రమాదకర రోగాలను రాకుండా అడ్డుకునే లై...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / raitunestham  
☛ Follow us on -   / rytunestham  
----------------------------------------------------
#millets
#naturalfood
#helthyfood
#organicfood
#kadharvallidiet

show more

Share/Embed