Ninne Aaraadhincheda.||నిన్నే ఆరాధించెదా.||
Shailamu Faith Ministries Official Shailamu Faith Ministries Official
21.9K subscribers
2,567,188 views
11K

 Published On May 20, 2022

#నా ఊపిరున్నంత వరకు - నిన్నే ఆరాధించెదా యేసయ్యా#...

పల్లవి:- ఆధారమేమున్నదీ నీవుతప్ప ఈలోకంలో, ...
ఆనందమేమున్నదీ నీవు లేక నాజీవంలో ..
"2" ఆదుకొనుచుంటివే ..నా కన్నతండ్రివోలే..
ఆదరిస్తుంటివే ..నా కన్నతల్లివోలే,..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా..-
నా యేసయ్యా-..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా .."2" అను.పల్లవి : ఆరాధించెదా ... నా పూర్ణమనస్సుతో .. - "2"
ఆరాధించెదా ... నా పూర్ణహృదయముతో..."2"
నా ఊపిరీ ఉన్నంత వరకయ్యా -
నా యేసయ్యా ..- నిన్నే నేను ఆరాధించెదా ."2"
చ:1.ఎబినేజర నీవయ్యీ - నన్నాదుకుంటున్నావూ - ఎదలోన కొలువయ్యీ - నను నడుపుకుంటున్నావూ.."2"
- ఆరాధించెదా ...
చ: 2.నినువిడువను , ఎడబాయననీ వాగ్ధానములిచ్చినావూ..
భయపడకూ , దిగులే పడకనీ - ధైర్యాన్ని నింపినావూ"2" ..
ఆరాధించెదా ...
చ:3.సీయోను నగరాన - ఆ నిత్యరాజ్యాన - శుద్ధులతో నేకలసి - స్తుతిపాట పాడెదా "2" ఆరాధించెదా ...
ఆధారమేమున్నదీ నీవు తప్ప ఈ లోకంలో...
ఆనందమేమున్నదీ నీవులేక నా జీవంలో...

#సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు మాత్రమే కలుగును గాక.#
* ఏదో ఒక పాట రాయాలి, అందరికీ కనబడాలి, మనుష్యుల మెప్పుపొందాలని, గొప్ప కొరకో, పేరు కొరకో, నేను కూడా బాగా పాడుతాను అని చూపించు కోవడం కొరకో, #సబ్ స్క్రైబర్స్ పెంచుకొనుట కొరకో, కాదు, గుండెకు తగిలిన వందల గాయాల లోనుంచి, వెలివేత, నిందా అవమానములలోనుంచి,మనుష్యులకు దూరమై, ప్రభువు పాద సన్నిధికి చేరువైన వేళ హృదయము ద్రవించి కన్నీరు ఉప్పొంగిన వేళ, ప్రభువు పలికిన మాటలే, ఆయన కృప చేత, పరిశుధ్ధాత్మ సహాయముతో ఈ పాటలు స్రవించినవి,#కేవలం#యేసయ్య కృప తప్ప,
నా గొప్ప ఏమీలేదు. ఎన్నికలేని, ఏ యోగ్యత లేని, 9వ తరగతి తప్పిన, పనికి రాని వాన్ని, ఎప్పుడో మంటికి మన్నై పోవలసిన వాన్ని, కనికరము గల దేవుడు, శాశ్వత కృప చేత నిలబెట్టి, కొన్ని వందల పాటలు రాయించి, పాడించి, తన ఘన నామమునకు ఉన్నత మహిమ పొందుతున్నారు. దేవునికి స్తోత్రము.
దాదాపు 19 సంవత్సరాల నిరీక్షణ, కన్నీటి ప్రార్థన, దేవుని మహా కృప వలన, ఈ ప్రతిఫలము, నా కన్నీళ్ళతో ప్రభువు పాదాలు కడిగి, సాగిల పడి, నా నిండు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, చెల్లిస్తూన్నా, నా తండ్రి నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను . హల్లెలూయ.
ఈ పాటలు విడుదల చేసే విషయంలోఎన్నో మోసాలు, అన్యాయాలు, నిందలు, ఆటంకాలు,ఆత్మీయులే గుండెలపై తన్ని అవమానం పాలు చేసారు.కొందరు పాటలు, రాగము, దొంగిలించారు, కొందరు నమ్మించి మోసం చేశారు, నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నారు,దేవుడు వారిని క్షమించి, దీవించును గాక. ఏదేమైనా వాగ్ధానము చేసిన ప్రభువు, నమ్మదగిన దేవుడు గనుకనే, ఆయనే ఆధారమునకు చాలిన దేవుడు గనుకనే, మీ అందరి ప్రశస్తమైన ప్రార్థనల ఫలముగా, సంఘము అంతటి ప్రశస్తమైన ప్రార్థనల ఫలముగా, ఆత్మీయుల ప్రార్థన, ప్రోత్సాహము,సహకారముతో, ప్రభువు మహా కృప చేత, ఈ పాట మీ ముందుకు, వస్తున్నది, ఎందుకు నా హృదయ లోతుల్లోంచి మీతో పంచుకుంటున్నాను అంటే, నాకంటూ వేరొక ఆశ, ఆశయం ఏమీ లేవు, ప్రభువుచిత్తముచేయుటకు,సజీవయాగముగా, #20 సంవత్సరాల క్రితం ఈ జీవితాన్ని ప్రభువుమహిమ కొరకై సమర్పించుకుని, ఈ ఆత్మీయయాత్రలో ప్రభువు అనుమతించిన పరీక్షలు, శ్రమలు, మనుష్యుల స్వార్థ ప్రేమలలో, పడకుండా, చెడకుండా, ఆ పరలోకపు తండ్రే కనుపాపలా కాచి కాపాడుతున్నడు, పాఠాలు నేర్పిస్తున్నారు, ఆయనకు సజీవసాక్షిగా,మీ యెదుట సాక్ష్యంగా పంచుకుంటున్న తప్ప, వేరే ఏమీ లేదు గొప్ప. #ఇంత వరకు ఓపికగా ఇది చదువుతున్న మీ జీవితంలో కూడా ఆ జీవముగల దేవుడు, కార్యము చేస్తారు, వేచి యుండు, అన్యాయము చేయడు, నీ కన్నీరు చూస్తున్న దేవుడు, తన కవిలెలో జ్ఞాపకార్ధంగా దాస్తున్న దేవుడు, చేయి విడువడు, నిన్ను మరువడు, ధైర్యం తెచ్చుకో, ప్రతీ పరీక్ష ఒకరోజు గొప్ప సాక్ష్యంగా మార్చ బడుతుంది,#ఎన్నిక లేని నన్ను ఇంతగా ప్రేమించే తండ్రి, నిన్ను కూడా వెల్లడి చేసుకుంటాడు, ప్రతీ ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం దాగి ఉంది.ఇది నాకు ప్రభువు కలుగజేసిన ఆత్మీయ అనుభవమే, తన కృప కొరకు కనిపెట్టువారి యందు ఆనందించే దేవుడు, నీ యెడల ఆనందిస్తున్నాడు.ఎవరునిన్ను విడిచినా,మరచినా, కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించు, తగిన సమయమున తన కృప చేత, హెచ్చిస్తాడు.హల్లెలూయ. దేవునికి స్తోత్రము.
#ప్రభువు తన కృప మహదైశ్వర్యము చొప్పున మీ ప్రతీ హృదయ వాంఛ తీర్చును గాక. #దేవుడు దీవించు గాక.ఆమేన్.
నా కొరకు నూ మీ ప్రశస్తమైన ప్రార్థనల లో జ్ఞాపకము చేసుకుంటారని ప్రార్ధిస్తున్నాను.
#ప్రత్యేక ధన్యవాదములు,కృతజ్ఞతలు, ఎంతో,ప్రార్థించి,సహకరించి,ప్రోత్సహించిన, దైవజనులకు,ప్రభువిచ్చిన,ఆత్మీయ నాయకులకు,పెద్దలకు.నానిండు వందనములు,ప్రసన్నకుమార్,గారికీ హేమచంద్ర,గారికీ,స్వామీ,గారికీ,కృతజ్ఞతలు.
#ప్రత్యేక కృతజ్ఞతలు,ఎంతో ప్రార్థించి, సహకరించి,ప్రోత్సహించిన,దైవజనురాలు, ప్రభువిచ్చిన,నాజీవిత భాగస్వామి, పిలుపులో,సేవ,పరిచర్యలో,పాలి భాగస్తురాలు,నా ప్రియమైన భార్య, శిరీషకు.
ప్రియా పరిశుధ్ధాత్మకును ప్రేమతో అంకితం.
#సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు మాత్రమే కలుగును గాక.ఆమేన్.*
#శైలము ఫెయిత్ మినిస్ట్రీస్
#హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ #నల్లగొండ.సమర్పించు
#ఉత్సాహ ధ్వని
#ఉజ్జీవ జయ సునాధములుvol-3.
*కనికరము గల దేవుడు.
#రచన, స్వర కల్పన గానం:-
#ప్రభువు మహా కృప చేత,
#బ్రదర్.శ్రీ శైలము. ఇ. యన్. యస్.
#Shailamu Faith Ministries.
#House Of Prayer For All Nations.
#Nalgonda.
#Music:-యం.అశోక్,గారు.#హైదరాబాద్.
#జత పనివారు:-వినయ్.-హుజురాబాద్ #సంఘ బిడ్డలు,యవ్వనస్థులు.
#వీడియో ఎడిటింగ్:-రాయుడు,గారు, #హైదరాబాద్.
#తండ్రియైన దేవుని ప్రేమ,మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వత కృప,ప్రియా పరిశుధ్ధాత్మ అన్యోన్య స్నేహము,సహవాసము, సంబంధము,ఈ మాటలు చదువుచున్న వారికీ,ఈ పాటలువింటున్న వారికీ,ప్రార్థించిన ప్రతీ ఒక్కొక్కరికి,సంఘము,సేవపరిచర్య,కు, సంఘబిడ్డలకు,జతపనివారికీ,సంగీత దర్శకులకు,ఎడిటింగ్ చేసిన వారికీ,లోకంలో పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైయుండి నడిపించునుగాక#ఆమేన్.
#Latest Telugu Christian Worship Song's.
#Shailamu Faith Ministries

show more

Share/Embed