Portable Sprayerతో పత్తి చేనులో మందు కొడుతున్నం | రైతు బడి
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
236,184 views
1.9K

 Published On Jul 28, 2022

ఈ వీడియోలో రైతు చల్లా రామయ్య గారు మాట్లాడారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో ఈ రైతు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో తాను ఇటీవల రెండోసారి వినియోగిస్తున్న పోర్టబుల్ స్ప్రేయర్ గురించి మాట్లాడారు. మందు పంపు మోసే పని లేకుండా ఈజీగా పోర్టబుల్ పంపుతో స్ప్రే చేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత.. డీలర్లను అన్ని సందేహాలు అడిగి తెలుసుకొని.. ఆ తర్వాత మీకు ఉపయోగపడుతుందని నిర్ణయించుకుంటేనే ఇలాంటి స్ప్రేయర్ గురించి ఆలోచించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Portable Sprayerతో పత్తి చేనులో మందు కొడుతున్నం | రైతు బడి

#RythuBadi #పత్తిమందు #PortableSprayer

show more

Share/Embed