Nandavaram Chowdeswari Devi Charitra full movie || Latest Telugu Full Movie || Latest New Movie
SKGS CHANNEL SKGS CHANNEL
79.5K subscribers
358,914 views
2.3K

 Published On Premiered Apr 19, 2020

హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలక్ష్మీ వంటి దేవతలు ఎంతో మంది ఉన్నారు. అందులో చౌడేశ్వరీ దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రయాణం చేసేయాల్సి ఉంటుంది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవు. అందువల్ల ప్రజలు చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకొని కాశీని చేరుకొని అక్కడి దేవతలను సందర్శించుకునేవారు. అయితే తాము అంత దూరం ప్రయాణం చేయలేమని కొంతమంది భక్తాగ్రేసరుల కోరిక పై అక్కడి దేవతలు భారత దేశంలోని నలుమూలలా కొలువై ఉన్నారు. ఈ కోవకు చెందినదే చౌడేశ్వరీ దేవి దేవాలయం. ఈ చౌడేశ్వరీ దేవాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇదిలా ఉండగా ఈ చౌడేశ్వరీ దేవే కర్నాటకలోని టిప్పుటూర్ కు దగ్గర్లో కూడా ఉందని కొంతమంది చెబుతున్నారు. పురాణాలకు సరైన లిఖిత పూర్వక ఆధారాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ కథనంలో కర్నూలు జిల్లా నందవరం ప్రాంతంలో వెలిసిన చౌడేశ్వరీ దేవి గురించి మనం తెలుసుకొందాం.
ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడనే రాజు ప్రజారంజకంగా పాలించేవాడు. ఆయనకు దత్తాత్రేయ భక్తుడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తత్రేయుడు ప్రత్యక్షమయ్యి కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు (పాదరక్షలు) నంద భూపాలుడికి అందజేస్తాడ
.అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్లి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు. దీని వల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పావుకోళ్ల విషయం ఎవరికీ చెప్పకూడదని షరత్తు విధిస్తాడు.
ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోళ్లను తీసుకొంటాడు. దత్తత్రేయుడు చెప్పినట్లు ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలోనే కాశీకి వెళ్లి అక్కడి గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని కాశీ విశాలక్షిని సందర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు.
ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతి రోజు తన భర్త రోజూ తెల్లవారుజామున ఎక్కడికో వెలుతున్నాడని అనుమానం వస్తుంది. ఒక రోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకొంటుంది.
దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతోపాటు కాశీకి తీసుకొని వెలుతాడు. అక్కడ స్నానాలు ముగించుకొన్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది.
దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతోపాటు కాశీకి తీసుకొని వెలుతాడు. అక్కడ స్నానాలు ముగించుకొన్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది.
దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయల్సిందిగా అక్కడే ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు లోనవుతారని బాధపడుతాడు.
అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకొంటారు. దీంతో ఆ బ్రహ్మణులు తమ తప:శక్తిని రాజుకు, ఆయన భార్యకు అందజేస్తారు.
ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి భార్యా సమేతుడై నందవరానికి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది.
దీంతో బ్రహ్మణులు తమకు సహాయం చేయాల్సిందిగా నందవరంకు వచ్చి రాజును అర్థిస్తాడు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్నదానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తారు.కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరీ దేవి సాక్షమని ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెబుతారు.ఇందుకు చౌడేశ్వరీ దేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరత్తు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరు వెను తిరిగి చూసినా తాను వెనక్కు వెళ్లిపోతానని చెబుతుంది.
దీనికి అంగీకరించిన బ్రహ్మణులు చౌడేశ్వరీ అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలు దేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రహ్మణుడు వెనక్కు తిరిగి చౌడేశ్వరీ దేవి వస్తోందో? లేదో? అని చూస్తాడు.దీంతో చౌడేశ్వరీ దేవి అక్కడే శిలరూపంలో ఉండిపోతుంది. విషయం తెలుసుకొన్న రాజు అక్కడికి వచ్చి బ్రహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతారు.ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాధికార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రహ్మణులను నందవరీకులని పిలుస్తారే. వీరు ఇప్పటికీ తమ కులదైవతగా చౌడేశ్వరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.అమ్మవారు వచ్చిన సొరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరినీ అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేది. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు.దీంతో రాజు అమ్మవారు శిలా రూపం దాల్చిన చోటు పై భాగంలో అంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించాడు. ఇక అమ్మవారి విగ్రంఒక చేతిలో ఖడ్గం, మరోచేతిలో కుంకుమ భరిణే ఉంటుంది.
అమ్మవారి గర్భగుడికి బయట ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు.

show more

Share/Embed