GUMMADI BATHUKAMMA SONG DJ VERSION Title
VR1 ARTS VR1 ARTS
237 subscribers
1,498 views
0

 Published On Oct 9, 2024

పల్లవి:-
గుమ్మడి గుమ్మాడి గుమ్మాడి పూలన్ని గుంపుగ చేరినయే బతుకమ్మ గుంపుగ చేరినయే
తంగేడి తంగేడి తంగేడి పూలన్ని చీరోలె చుట్టినయే బతుకమ్మ సింగారం పెంచినయే
పొద్దున్నే లేచి చిన్నపొరగాళ్ళు అల్లి పూలెన్నో తెచ్చినారే
ముద్దు గుమ్మలంత నిన్ను ముద్దుచెయ్య గునుగుపూలెన్నో తెచ్చినారే
సీతమ్మ పువ్వులు తెచ్చినారే, తీరొక్క పువ్వులు తెచ్చినారే
ఎంగిలి పువ్వులు ఏసినారే, ఏడుక చేసి మురిసె వీరే
|| హే గుమ్మ గుమ్మంలో గుమ్మాడీ ఇది బతుకమ్మ పాట సందడీ
గుమ్మ గుమ్మంలో గుమ్మాడి మన బతుకు పాట చేసే సవ్వడీ||

చరణం:- 1
ఒక్కటి ఒక్కటి పూలెన్నొ చేరి చక్కటి బతుకమ్మ అయ్యినయి - చక్కటి బతుకమ్మ అయ్యినయి
రెండూ రెండూ చేతులు కలిసి చప్పట్ల మోతే మోగినయి- చప్పట్ల మోతే మోగినయి
మూడు మూడు ముచ్చటగా మురిసేటి పాటలు పాడుకుంటూ - మురిసేటి పాటలు పాడుకుంటూ
నాలుగు నాలుగు తొవ్వలకాడా నలుగురమొకటై ఆడుకుంటూ- నలుగురమొకటై ఆడుకుంటూ
నీ పాట పాడుతమే బతుకమ్మ , నీ ఆటలాడుతమే
నీ పూజ చేస్తుంటమే గౌరమ్మ, నీ కీర్తి పొగుడుతమే
ప్రకృతిని పూజించగా దుర్గమ్మ పాడి పంటలనిస్తావే
పంచ భూతాల్ని పూజించగా గంగమ్మ ఏకరువు రానియ్యవే
|| హే గుమ్మ గుమ్మంలో గుమ్మాడీ ఇది బతుకమ్మ పాట సందడీ
గుమ్మ గుమ్మంలో గుమ్మాడి ఇది రంగులద్దినా సింగిడీ||


చరణం-2
ఒక్కరు ఒక్కరు ఊరోళ్ళు ఎందరొ పనికై పట్నం పోయినారు- పనికై పట్నం పోయినారు
రెండూ రెండూ రెక్కల కష్టం కిరాయె కట్టి బతుకుతారు - కిరాయె కట్టి బతుకుతారు
మూడు మూడు ముద్దగున్నా ఇన్స్టా రీల్సు చేస్తున్నరు- ఇన్స్టా రీల్సు చేస్తున్నరు
నాలుగు నాలుగు దిక్కులు చూడంగ నలుగురి కంటా పడుతున్నరు- నలుగురి కంటా పడుతున్నరు
ఎన్ని పనులు చేసినా బతుకమ్మ మా బతుకు మారలేదే
ఎంత సదువు సదివినా బతుకమ్మ ఉద్యోగం రాలేదులే
యాపారం చేద్దామంటే బతుకమ్మ రూపాయి లోనియ్యరే
కోట్లు కొల్లగొట్టినా బతుకమ్మ కొందర్ని ఏం చెయ్యరే
||హే గుమ్మ గుమ్మంలో గుమ్మాడీ ఇది బతుకమ్మ పాట సందడీ
గుమ్మ గుమ్మంలో గుమ్మాడి మన బతుకు పాట చేసే సవ్వడీ||

చరణం-3
ఒక్కరు ఒక్కరు అందరు కలసి పాలపిట్ట సూడబొయ్యినారు- పాలపిట్ట సూడబొయ్యినారు
రెండే రెండూ దమ్ములు అంటూ తాటికళ్ళే తాగినారు- తాటికళ్ళే తాగినారు
మూడు మూడు ముచ్చటగా జమ్మికొమ్మ కొట్టి తెచ్చినారు- జమ్మికొమ్మ కొట్టి తెచ్చినారు
నలుగురు నలుగురు సందడి చేస్తూ జమ్మి పూజ చేసినారు- జమ్మి పూజ చేసినారు
ఊరిడిసి పోయినోళ్ళు బతుకమ్మ దసరకు తిరిగొచ్చిరే
బాధలు మరిచిపోయి బతుకమ్మ చిందులు ఏస్తున్నరే
జమ్మాకు పంచుకుని బతుకమ్మ దోస్తాను అంటున్నరే
పండుగ పేరుతోని బతుకమ్మ సంబుర పడుతున్నరే
|| హే ధూం ధాం ధూం ధాం ధూం ధాము మనం దసరా పండుగ చేద్దాము
ధూం ధాం ధూం ధాం ధూం ధాము దుమ్ములేసేటట్టు మనమాడుదాము|| 2 ||

Unsung Lyrics
చరణం-4
ఒక్కటి ఒక్కటి సుక్కలు అన్నీ ఆకాశమంతా నిండేయేల- ఆకాశమంతా నిండేయాల
రెండూ రెండూ దీపాలు పెట్టి బతుకమ్మనెత్తుతమే నెత్తిన- బతుకమ్మనెత్తుతమే నెత్తిన
మూడు మూడు మూకుమ్మడిగా గుంపుగా చేరుతమే, చుట్టూ గుండ్రంగ తిరుగుతమే
నాలుగు నాలుగు నవ్వూకుంటూ నిన్ను సాగనంపుతమే- నిన్ను సాగనంపుతమే
ఏఅర్ద రాతిరైన ఆడొళ్ళకు స్వాతంత్ర్యం కావాలంటూ
ఆడేటి ఆట నీదే బతుకమ్మ పాడేటి పాట నీదే
ఊరంత ఒక్కటయ్యి బతుకమ్మ కలిసే ఉందామంటూ
నమ్మకం పెంచుకుంటూ బతుకమ్మ నవ్వులు పంచుకుంటాం
|| గుమ్మ గుమ్మంలో గుమ్మాడీ ఇది బతుకమ్మ పాట సందడీ
గుమ్మ గుమ్మంలో గుమ్మాడి మన బతుకు పాట పాడే కొత్తదీ ||


#latestbathukammasong #2024bathukammasongs #telanganafolksongs #gummadibathukammatapa #VR1ArtsSongs #vr1ats #bathukamma2024 #bestsongs #folksongs #telugusongs #folksongs #2024folksongs #bathukamma2024 #vishvanrajds #hyderabad #karimnagarbidda #djFolk #djfolk #bathukammadance #ddance #djdancemix


Join us in celebrating the joy and togetherness that Bathukamma brings. Your support means everything to us—please like, share, and subscribe for more beautiful music!

✨ Let’s spread the joy of Bathukamma together! ✨

#GummadiBathukamma #Bathukamma2024 #TeluguSongs #VishvanrajDS #Shirisha #VR1Arts #SupportLocalArtists #FestivalVibes #TeluguCulture #SongRelease

🙏 Thank you for your support! Enjoy the song! 🌼

show more

Share/Embed