మనసార హరిభజన చేయరా. తోడి రాగం. నేర్చుకునే వారికి సులభమైన పాట. లిరిక్స్ ఉన్నవి
Ckreddy Devotional Ckreddy Devotional
14.5K subscribers
2,102 views
50

 Published On Jan 24, 2023

మనసారా హరిభజన చేయరా

తోడి రాగం. అది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం

పల్లవి

మనసార హరిభజన చేయరా
నీ నోరారా నారాయణా యనరా..

చరణం 1

పాటేరాదని ప్రజలు నగుదురని
పాటకు సరిపడు తాళము లేదని
గాత్ర శుద్ధియె కమ్మగలేదని
భయము, బిడియము, బాధయు వలదురా
"మనసార హరి భజన"

చరణం 2

పాటకు , తాళము, గాత్ర మున్ననూ
మనసేలేని స్మరణెందుకురా
మనసొక చోట తనువొక చోట
ఉన్న వారల జన్మమె వృధరా
"మనసారా హరి భజన"

చరణం 3

యోగియైనా మహా భోగియైనా పూర్వజన్మ సుకృతమే పోదురా నారాయణుని నామస్మరణతో
నరకపు బాధలు తొలుగునురా
"మనసార హరి భజన"

show more

Share/Embed