ఈ చిలుక నీరు త్రాగి ఎగిరిపోతే కలియుగ అంతం | Sangameswara Temple in Animela River
PRAVEEN RAYAPATI PRAVEEN RAYAPATI
16K subscribers
510,192 views
1.1K

 Published On Jun 26, 2023

#sangameswara #brahmamgarikalagnanam
ఈ చిలుక నీరు త్రాగి ఎగిరిపోతే కలియుగ అంతం | Sangameswara Temple in Animela River
సంగమేశ్వర దేవాలయం అనిమెల
మీరు చూస్తున్న ఈ చిలుక నీరు తాగి ఎగిరిపోతే కలియుగ అంతం అవుతుందని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ కాలజ్ఞానం లో చెప్పటం జరిగింది .. ఇంతకీ ఈ దేవాలయం ఈ చిలుక ఎక్కడ ఉంది ఈ దేవాలయం కు ఉన్న గొప్ప చరిత్ర ఏంటి ?
ఇక్కడ ఉన్న శివలింగం పై ఒక గుంత ఉంటుంది ఆ గుంతలో నిరంతరం నీరు ఊరుతుంది ఆలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎన్నో విషయాలను మీతో పంచుకోబోతున్నాను ఈరోజు
కడప పట్టణం నుంచి సుమారు 45 కిలో మీటర్ల దూరంలో వీరపునాయనిపల్లె మండంలోని అనిమెల గ్రామానికి సమీపంలో ఈ సంగమేశ్వర ఆలయం ఉంది.
పాపాగ్ని, మొగమేరు, ఉద్ధండవాగు అనే మూడు నదుల కలయిక ఇక్కడే జరగటం మూలాన ఈ దేవాలయానికి సంగం అనే పేరు కలిపారు. ఈ దేవాలయంలో ఉన్న ధ్వజారోహణస్తంభంపై ఒక పంచలోహ చిలుక చూడటానికి అందంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి, గుర్రపుశాలలు ఇక్కడ కనిపిస్తాయి.
సంగమేశ్వర స్వామి వారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్టించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో సప్తఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్యమహాముని శివలింగాన్ని ప్రతిష్టించి ప్రతిరోజూ అభిషేకించి అర్చనలు నిర్వహించే వారని స్థలపురాణం చెబుతోంది.
కలియుగ ప్రవేశంతో పుజాపునస్కారములు లేకుండా పోవడంతో కాలక్రమములో శివలింగం భూమిలో పూడిపోయింది.
మరి ఆ శివలింగం ఎలా బయటపడింది అక్కడ పూజ కార్యక్రమాలు ఎలా మొదలుపెట్టారు అన్న దానికి స్థానికులు చెప్పే కథ ఒకటి ప్రచారం లో ఉంది ..
సంగమేశ్వర స్వామి వెలసిన ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజుగారికి పెద్ద ఆవుల మంద ఉండేది.
ఈ ఆవుల మంద ప్రతిరోజూ సంగమేశ్వర స్వామి వెలసిన అడవీ ప్రాంతంలో మేత మేసి గోశాలకు చేరేవి. కానీ ఒక్క ఆవు మాత్రం గోశాలకు వెళ్లేముందు మందను వదిలి దూరంగా వెళ్లి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదిలి అనంతరం గోశాలకు చేరేది. దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించసాగాడు.
పుట్టపై పాలను ధారగా వదిలే ఆవును చూసిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఆవు తప్పుంచుకోగా, ఆ దెబ్బ పుట్టలోని శివలింగమునకు తగిలింది. ఇంకా రెచ్చిపోయిన కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలిపైకి ఎత్తడంలో "నేను సంగమేశ్వరుడిని ఈ పుట్టలో ఉన్నాను. ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది. పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి మేలు జరుగుతుంది" అనే మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయి.
ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలపగా పుట్టను తొలగించి, సంగమేశ్వర లింగాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించి పూజా పునస్కారాలను ప్రారంభించినట్లు స్థలపురాణం చెబుతోంది
శివలింగంపై కొంత గుంతగా ఉంటుంది. అది పశువుల కాపరి గొడ్డలి దెబ్బ అని పురోహితులు చెబుతున్నారు. దేవేరి అయిన పార్వతీ దేవి ప్రత్యేక గర్భాలయంలో కొలువుదీరి ఉన్నారు. దక్షిణాముఖంగా ఉన్న శ్రీ పార్వతీదేవి నిలుచున్న భంగమలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయ ముఖమండపానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
ఈ ఆలయంలోని విశాలమైన ముఖమండపం నేలపై నీలి శిలలు పరచబడి ఉన్నాయి. ఈ శిలల మహాత్త్మానికి సంబంధించిన కథ ఉంది. పూర్వం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కడైనా దొంగతనములు జరిగితే దొంగల బారిన పడి వస్తువులు పోగొట్టుకున్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని రంగమండపంలోని నేలపై పరచబడి ఉన్న బండలపై చూస్తే దొంగల ఆచూకీతో పాటు దొంగతనమునకు గురైన వస్తువులు ఎక్కడ దాచివున్నారనేది కూడా స్పష్టందా కనిపించేదట. దీంతో దొంగలను సులభంగా పట్టుకునేవారట.
ఈ దేవాలయంలో ఉన్న ధ్వజారోహణస్తంభంపై ఒక పంచలోహ చిలుక చూడటానికి అందంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి, గుర్రపుశాలలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ ఐదు రోజుల పాటు తిరుణాల జరిపేవారు. కార్తీక మాసంలోని నాలుగు సోమవారాలు ఇక్కడ తిరుణాల జరుగును. అలాగే శివరాత్రి పర్వదినాన ఇక్కడ హరికథా కాలక్షేపం జరుగును. ఈ ఆలయానికి నాలుగు ప్రధాన గోపురాలున్నాయి. అన్నీ ఒకే సమయంలో కట్టించినవి కావని నిర్ధారించారు. సంగమ స్థలంలో కొండపై ఉన్న ఈ గుడి యొక్క గోపురాలు అనేక కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి.
కడప పట్టణం నుంచి వీరపునాయనిపల్లె లేదా కమలాపురంకు చేరుకుని సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. వీరపునాయనిపల్లె నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనిమెల సంగమేశ్వరాలయానికి ఆటోల ద్వారా వెళ్లవచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కమలాపురం నుంచి ఆలయం వద్దకు బస్సు సౌకర్యం ఉంది.

అయితే ఈ చిలుక నీరు తాగి ఎగిరిపోయిన రోజు కలియుగ అంతం జరుగుతుందని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం లో చెప్పటం జరిగింది , అయితే స్థానికులు చెప్పే దాని ప్రకారం పక్కనే ఉన్న మూడు నదులు కలిసే స్థలం కాబట్టి ఆ నదులు పొంగిన రోజు ఆ నీరు చిలుకను తాకుతాయని ఆ సమయానికి వరదలు పొంగి పొర్లి లోకం అంతం అయ్యే అవకాశం ఉండచ్చని చెప్తుంటారు ..

అడ్రస్ :
అనిమెల, వీరపునాయనిపల్లె మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆలయ సమయాలు
ఉదయం గంటలు: 6 am - 1 pm.
సాయంత్రం గంటలు: 2 pm - 8 పీఎం

show more

Share/Embed