O Yesu Nee Prema | ఓ యేసు నీ ప్రేమ | Hebron Songs of Zion
Joseph Ranjith Joseph Ranjith
2.39K subscribers
800 views
37

 Published On Mar 5, 2022

#songsofzion #teluguchristiansongs #hebron #andhrakraistavakeerthanalu



ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2)      ||ఓ యేసు||

అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2)                ||ఓ యేసు||

సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2)                ||ఓ యేసు||

కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2)                ||ఓ యేసు||

దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2)                ||ఓ యేసు||

show more

Share/Embed