అరుదైన ఆవులన్నిటినీ ఇక్కడే చూడచ్చు | 365 Days Chintalakunta Cattle Market - ABN Agri
ABN Agri ABN Agri
131K subscribers
69,074 views
1K

 Published On Premiered Jul 12, 2024

#OrganicFarming #ABNAgri #naturalagriculture
అరుదైన ఆవులన్నిటినీ ఇక్కడే చూడచ్చు | 365 Days Chintalakunta Cattle Market - ABN Agri

గమనిక : Abn Agri చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వారు ఇచ్చేది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే కావున అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాత ప్రత్యక్ష శిక్షణానంతరం మీ వ్యవహారంలోకి తెచ్చుకోగలరు, ఇతర లావాదేవీలు జరుపుకోగలరు . వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.


చింతల కుంట పశువుల సంత ..
సింపుల్‌గా చెప్పాలంటే ... దూడల మార్కెట్‌...

వారానికోసారి జరిగే
మామూలు సంత కాదది...
ఏడాది పొడవునా సాగే
ఎంతో అరుదైన మార్కెట్‌ ...

పశువుల సంత అనగానే కొందరు
చిన్న చూపుతో చూస్తారేమో.. కానీ..

.. అక్కడ జరిగేది కేవలం బిజినెస్‌ కాదు..
అవసరాలూ ఆర్థిక బంధాల మధ్య
ఆప్యాయతలూ అనుబంధాలూ కూడా
చేతులు మారే చిత్రమైన ప్రపంచం అది !

కొండంత అవసరం ఉన్నా...
అది... కొనేలా చేయలేకపోవచ్చు.
కానీ ... ఆవగింజంత అవసరం ఒకోసారి
అమ్ముకునేలా చేస్తుంది.

పశువుకీ మనిషికీ ఉన్న బంధం
ప్రకృతి అంతటి పురాతనం...

పశువుల్ని సంబోధిస్తూ ఓ కవి అంటాడు...
పగలనకుండా రేయనకుండా
పరోపకారం చేస్తారు ...
జాలిలేని నర పశువుల కన్నా...
మీరే మేలనిపిస్తారు ... అని!

మనిషి మనిషిగా లేనప్పుడు
పశుప్రవృత్తి పైకి లేచినప్పుడు
పశువా అంటూ మనిషిని తిడతాం.
మనమే ఏదో గొప్పనుకుంటాం..

కానీ -
పశువు లేనిదే పంట లేదు..
పంట లేనిదే మనిషి లేడు ...
టెక్నాలజీతో మనిషికి కొమ్ములొచ్చినా..
పశువుల విలువ మాత్రం తగ్గిపోదు.

ప్రకృతి ఇచ్చిన పశుసంపద
ప్రకృతి ఉన్నంతకాలం మనిషిని
శాసిస్తూనే ఉంటుంది
మానవజాతి పశువునుంచి
ఏదో లాభం ఆశిస్తూనే ఉంటుంది.

వ్యవసాయ ఆధారిత దేశంలో ..
పాడి పరిశ్రమే ప్రాణమైన రాజ్యంలో ..
పాడి నుంచి పేడ వరకూ
ప్రతి ఒక్కటీ విలువైనదే మరి !

కవిగారు అన్నట్టు..
అవి... తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు
సంపద పెంచే జాతిరత్నాలు

అందుకే -
మా ఇలవేల్పులు మీరు లేనిదే
మానవజాతికి బతుకే లేదు ..
అంటూ జనం ప్రతినిత్యం
ఈ సంతలో పశువుల్ని కొంటూ ఉంటారు.

BEST VIDEOS
ఆవు పాల మజ్జిగ విలువ మీకు తెలుసా?
   • ఆవు పాల మజ్జిగ విలువ మీకు తెలుసా? | D...  

రైతే రాజు చేతల్లో చూపిస్తున్న రైతన్న
   • రైతే రాజు చేతల్లో చూపిస్తున్న రైతన్న ...  

ఇలా చేస్తే రైతుకు డబ్బే డబ్బు
   • ఇలా చేస్తే రైతుకు డబ్బే డబ్బు / పంటకు...  


#CattleBreeds #BuffaloMarket #MilkProduction
Chintalkunta Buffalo and Cow Market Price. What Kinds of Buffaloes are There? Important Breeds of Murrah Buffaloes, Jaffrabadi, Surti, Banni Buffalo, Haryana Buffalo for Milk Production. High Quality Indian Buffalo Wholesalers Varaprasad, M. Radhakrishna Murthy, M. Anjaneyulu, Satyanarayana Raju, Chintalkunta Santha, Rangareddy District. #ToneAgri #BuffaloMarket #SmallBusinessIdeas #ChintalkuntaBuffalo #MurrahBuffalo #CattleBreeds #BuffaloBreeds #MilkProduction #FarminginTelugu #AgriFarming

show more

Share/Embed