ఆది కేశవ ఘాట్ అక్కడ ఉన్న మందిరం మరియు ఇతర మహిమాన్విత మందిర విశేషాలు | తప్పక చూడవలసిన ఆలయం
KASHI VIHARI Telugu - కాశీ విహరి KASHI VIHARI Telugu - కాశీ విహరి
78.7K subscribers
12,607 views
481

 Published On Dec 10, 2022

కాశీ విశ్వేశ్వరాయ నమః |

వరుణ నది మరియు అసీ నదుల ఉన్న మధ్య ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని వారణాసి అని పిలుస్తారు. వారణాసికి ఉన్న మరొక పేరే కాశీ. ఈ వరుణా నది గంగా నదిలో కలిసే ప్రాంతాన్ని ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మరియు ఇదే ప్రదేశంలో ఉన్న సుందరమైన ఆది కేశవుని మందిరాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ఘాట్ ను ఆది కేశవ ఘాట్ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే లోకపాలుకుడైన విష్ణుమూర్తి ఇక్కడ ఆది కేశవుడిగా పూజలు అందుకుంటున్నారు. కాశీఖండంలో ఒకచోట దివోదాసు అనే రాజు కాశీని పరిపాలిస్తున్నప్పుడు దేవతలు అందరూ కాశీని విడిచి వెళ్లిపోవాలని చెప్పి కోరుతాడు. అలా దేవతలందరూ మందరాద్రి పర్వతానికి వెళ్ళిపోతారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తరువాత శివుడు తనకి ఎంతో ఇష్టమైన కాశీ నగరాన్ని విడిచి ఉండలేక తిరిగి కాశీకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తాడు. అలా రాజు అయిన దివోదాసుని అక్కడినుండి పంపించి వేసే ప్రయత్నాలలో భాగంగా ముందుగా చతుషష్టి యోగినీ ఘనములను, తరువాత సూర్యనారాయణ మూర్తిని బ్రహ్మదేవుడిని, గణపతిని ఇలా చాలామందిని పంపుతాడు. అలానే విష్ణుమూర్తి కూడా కాశీకి వస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా కాశీలో ప్రవేశించిన స్థలమే ఈ ప్రాంతం. ఈ వీడియోలో మనం ఈ ఆది కేశవ ఘాట్ మరియు ఈ ప్రాంతంలో ఉన్న 11 ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందామండి.


ఈ ఘాట్ మరియు ఇక్కడ ఉన్న ఈ ఆదికేశవ ఆలయం సుమారుగా 4500 సంవత్సరాల పురాతనమైనవి. ఈ ప్రాంతంలో చూడవలసిన మొట్టమొదటి ముఖ్యమైన ప్రదేశం ఈ ఆది కేశవ ఘాటు. మన పురాణాలు నదీ సంగమ ప్రాంతాలు విశేషమైనవి అని అక్కడ ప్రత్యేకమైన శక్తి ఉంటుందని చెబుతాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వరుణా నది ఈ ప్రాంతంలోనే గంగా నదిలో కలుస్తుండడం వలన ఈ ప్రాంతం విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఆదికేశవ ఘాట్ అనీ, వరుణాఘాట్ అనీ, కేశవ ఘాట్ అని పిలుస్తారు. ఈ ఘాటుకు ఉన్న విశిష్టతను మత్స్య పురాణంలో కూడా వివరించారు. విష్ణుమూర్తి మొదటిసారి స్వర్గం నుండి కాశీకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కాళ్లను, చేతులను కడుక్కున్నాడట. అందుకే ఈ ప్రాంతాన్ని పాదోదక తీర్థం అని కూడా పిలుస్తారు. జ్ఞాన కేశవుడు కొలువై ఉండటం వలన శ్వేత దీపం కూడా అయింది. ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని కాశీఖండంలో ఉందండి. ఇంతటి అద్భుతమైన విశేషాలు కలిగినటువంటి ఈ ఘాట్లో తప్పకుండా స్నానం చేయండి.

ఈ ప్రాంతంలో చూడవలసిన రెండవ ముఖ్యమైన ప్రదేశం ఈ ఆది కేశవుని ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడిగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ఆది కేశవమూర్తి కొలువై ఉన్నారు. కాశీఖండం 79 వ అధ్యాయం ప్రకారం కాశీలో కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయండి. అందులో ఒకటి కేశవ పీఠం. ఈ పీఠంలోనే ఆదికేశవుని ఆలయం ఉంటుంది. ఇలాంటి శక్తి పీఠాలలో మనం పూజలు ఇతర దేవి కార్యక్రమాలు నిర్వహించడం వలన మామూలు ప్రాంతాల్లో చేసిన దానికంటే కొన్ని రెట్లు అధిక ఫలం లభిస్తుంది.
కాశీఖండం 61 వ అధ్యాయంలో స్వయంగా విష్ణుమూర్తి అగ్ని బిందువు అనే ఋషితో కాశీలో ఉన్న వివిధ విష్ణు తీర్థములు విష్ణు ఆలయాల గురించి వివరిస్తారు. ఎవరైతే ఈ ఆది కేశవుని రూపంలో పూజలు అందుకుంటున్న విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి సమస్త దుఃఖములు నశిస్తాయి. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. అంతకాలంలో వారికి విష్ణుమూర్తి మోక్షాన్ని కూడా కలగజేస్తాడు. అతి సుందరమైన పూర్తి సాలిగ్రామ విగ్రహం ఈ ఆదికేశవుని మూర్తి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామికి చెరువైపున పాదాల వద్ద ఉంటారు. స్వామికి చేసే అలంకరణలో భాగంగా మీకు మామూలుగా చూస్తే అమ్మవార్లు కనపడరు గాని జాగ్రత్తగా గమనిస్తే మీకు తప్పక దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆది కేశవుని దర్శించడం వలన ముల్లోకాలను దర్శించిన ఫలితం కలుగుతుందని కాశీఖండం 97వ అధ్యాయంలో ఉందండి. ఇదే అధ్యాయంలో ఈయనను కాశీ క్షేత్రానికి సంరక్షకుడిగా అభివర్ణించారు. ఆది కేశవుడిగా అవతరించిన విష్ణుమూర్తి ఇక్కడే ఒక లింగాన్ని ప్రతిష్టించాడు.


ఘాట్ గూగుల్ మ్యాప్ కో ఆర్డినేషన్
Adi Keshav Ghat
https://maps.app.goo.gl/e35AqGB6dNMPL...

show more

Share/Embed