Pandaripuram panduranga swamy temple full tour &history telugu |pandaripuramtempletour |maharashtra
Power Seek Media (Temples history) Power Seek Media (Temples history)
7.76K subscribers
420 views
38

 Published On May 27, 2023

#bayyasunnyyadav
#powerseekmedia
#trending
#peddapuli
#jagtial
#pandharpur
#templevlogs
#templevideos
#telangana
#india
#bjptelangana
#trs
#cinematic
#cinemanews
#youtube
#youtubevideos
#tirumala
#hyderabad
#myvillageshow
#bayyasunnyyadav
#cherryvlogs
 #darshan
#booking
#tickets
#accommodation
#location
#hidhu
#god
#srikrishna
#vital
#pandurangamahatyam
#pandurang
#templehistory
#temple
#motovlog
వసతి: గజానన్ మహరాజ్ మందిరంలో వసతి సౌకర్యం వున్నది.  అతి విశాలమైన ఆవరణలో, అందమైన గజానన్ మహరాజ్ మందిరం, ధ్యాన మందిరాలతో చాలా బాగుంది.  నాన్ ఎ.సి. డబల్ బెడ్ రూమ్ 250 రూ. లు.  ఇక్కడ ఇంకా అనేక రకాల వసతి సదుపాయాలు వచ్చే మనుష్యుల సంఖ్యనిబట్టి వుంటాయి.  అయితే రాత్రిపూట వెళ్తే గదులు ఇవ్వమన్నారు.  ఇంకా ముఖ్యం తప్పనిసరిగా ఫోటో ఐడెంటిటీ కార్డు వుండాలి.  ఇంకా అనేక వసతి సౌకర్యాలు దేవాలయంవారివి, ప్రైవేటువారివి వున్నాయి. ఆలయంలోకి సెల్ ఫోన్లు, కెమేరాలు, ఒక్కొక్కసారి స్త్రీల హేండ్ బాగ్ లుకూడా (కొంచెం పెద్దగా వుంటే) అనుమతించరు. ఆలయానికి ఎడమవైపునుంచి వెళ్తే తుకారాం మందిరంలో మధ్యాహ్నం 2-30 దాకా ఉచిత భోజన వసతి వున్నది.

పండుగలు: ప్రతి ఏకాదశికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.  ముఖ్యంగా ఆషాఢమాసం, కార్తీక మాసాలలో శుధ్ధ ఏకాదశిలలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.  ఈ ఏకాదశిలకు ముందు ఒక వారం రోజులనుంచీ పౌర్ణమి వెళ్ళేదాకా భక్తులు చాలా అధిక సంఖ్యలో వుంటారు.  ఇక్కడ వసతి సౌకర్యాలు అనేకం వున్నప్పటికీ ఈ ఉత్సవ సమయాల్లో వసతి దొరకటం కష్టం.

పుండరీకుని కధ

పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధంచెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు  దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు.  శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.  నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి.  ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు.

 #history

పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు.  కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు.  పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.

 

ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు.  పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు.  భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు.  పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.  విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు.  విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.

show more

Share/Embed